
ప్రాథమిక దశలో క్యాన్సర్ గుర్తించాలి
వైద్య సిబ్బందితో డీఎంహెచ్‌వో హైమావతి
అనకాపల్లి: క్యాన్సర్‌పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో వైద్యం అందించినట్లయితే ఆరోగ్యంగా జీవిస్తారని డీఎంహెచ్‌వో ఎం.హైమావతి తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లాలో పీహెచ్‌సీ వైద్యులతో సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా ప్రజలకు క్యాన్సర్ లక్షణాలు కనిపించినట్లయితే మొదటి దశలో స్క్రీనింగ్ టెస్ట్, రక్తపరీక్షలు చేయించాలన్నారు. కొంతమంది వ్యక్తులకు క్యాన్సర్ 3, 4 దశల్లో ఉన్నప్పుడు తెలుసుకుంటారని, అటువంటి వారికి సకాలంలో వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ పీవో డాక్టర్ ఎస్తేర్‌రాణి, వైద్యులు పాల్గొన్నారు.