
కూలీ స్థలం కబ్జా చేశారు
తన ఇంటి స్థలం కబ్జా అయిందని పదే పదే ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదంటూ అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామానికి చెందిన నగిరెడ్డి సన్యాసిరావు అర్జీ సమర్పించారు. గ్రామంలో సర్వే నెం.50లో తన పేరున గల (అసెస్‌మెంట్ నెం.31) ఇంటిస్ధలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేస్తున్నారని ఆయన చెప్పారు. తాను కూలి పనుల నిమిత్తం కుటుంబంతో గాజువాక మండలం దువ్వాడలో ఉంటున్నానని, దీనిని ఆసరాగా చేసుకుని ఆక్రమణదారులు తన ఇంటి స్థలంలో నిర్మాణం చేస్తున్నారని, దీనిపై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, కలెక్టరేట్‌లో మూడుసార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం లభించలేదని ఆయన వాపోయారు.