
కల్తీ ఎరువులు విక్రయిస్తున్న దుకాణం సీజ్
చోడవరం: కల్తీ చేసి రైతులను దోపిడీ చేస్తున్న ఎరువుల దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. గవరవరం రోడ్డులో ఉన్న శ్రీ లక్ష్మీదేవి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎరువుల దుకాణంపై విజిలెన్స్ డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో అధికారుల బృందం బుధవారం దాడి చే సింది. గొడౌన్లలో నిల్వ ఉంచిన ఎరువులను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఎరువులను కల్తీ చేసి ఒకొక్క బస్తా దగ్గర రూ.300 అదనంగా వసూలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నట్టు గుర్తించారు. డీఏపీ ఎరువులో మరో నాసిరకం ఎరువులను కలిపి డీఏపీ ధరకు విక్రయిస్తున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది. మూడు రకాల నాసిరకం ఎరువులను కల్తీ చేసి అదనపు ధరలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. దీనిపై సదురు ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు.