దీనికేమంటారు స్పీకర్‌ గారూ.. | - | Sakshi
Sakshi News home page

దీనికేమంటారు స్పీకర్‌ గారూ..

Aug 21 2025 7:10 AM | Updated on Aug 21 2025 7:10 AM

దీనిక

దీనికేమంటారు స్పీకర్‌ గారూ..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో డాక్టర్లను మేనేజ్‌ చేసుకొని, దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని, దివ్యాంగ పెన్షన్లు తీసుకున్నారు. వాటిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేనే లేఖ రాశాను. ఇప్పటికే రాష్ట్రంలో లక్షకు పైగా పెన్షన్లు తొలగించారు. ఇంకా వెరిఫికేషన్‌ కొనసాగుతోంది. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే 4,148 మందిని అనర్హులుగా గుర్తించి, వారి డూప్లికేట్‌ దివ్యాంగ పెన్షన్లు తొలగించాం.

–ఇవి బుధవారం నర్సీపట్నం ప్రెస్‌మీట్‌లో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చెప్పిన మాటలు

కాసేపు మీ మాటలనే ప్రామాణికంగా తీసుకుందాం.. ఇవన్నీ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మేనేజ్‌ చేసి తీసుకున్న పింఛన్లే అనుకుందాం.. మరి గొలుగుండ మండలం విప్పలపాలేనికి చెందిన రుత్తల సూర్యవతి 16 ఏళ్ల నుంచి దివ్యాంగ పింఛన్‌ తీసుకుంటున్నారు. పుట్టుకతోనే మరుగుజ్జు. బుద్ధిమాంద్యంతో 50 శాతానికి పైగా వైకల్యంతో బాధపడుతున్నారు. ఆమె పెన్షన్‌ కూడా తొలగించారు.

గొలుగొండ మండలంలో గాదంపాలేనికి చెందిన వేములపూడి శాంతాకుమారికి 15 ఏళ్లుగా దివ్యాంగ పెన్షన్‌ వస్తోంది. 2010లో ఇచ్చిన కంప్యూటరైజ్డ్‌ దివ్యాంగ సర్టిఫికెట్‌తోపాటు యూఐడీ కార్డు కూడా ఉంది. ఆమెకు 83 శాతం అంగవైకల్యం ఉంది. మరుగుజ్జుతనం, బుద్ధి మాంద్యం, పుట్టుకతోనే ఆర్థోపెడిక్‌ సమస్యలున్నాయి. ఆమెను కూడా పింఛన్‌కు దూరం చేశారు.

దివ్యాంగులపై

కక్ష

వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించక ముందే పెన్షన్‌ మంజూరైన వీరిద్దరికీ కూడా రద్దు చేశారు. 40 శాతానికి మించిన వైకల్యం ఉన్నా.. వారి హృదయాలను ముక్కలు చేశారు. దీనికేమంటారు స్పీకర్‌ గారూ..?

వైకల్యంతో పుట్టడం బాధాకరం. దివ్యాంగుల్లా నటిస్తున్నారని చెప్పడం మరింత బాధాకరం. మొదటిది విధి వైపరీత్యమైతే.. రెండోది కూటమి నేతల కుటిల నీతికి నిదర్శనం. సామాజిక పింఛన్‌ మొత్తాన్ని పెంచుతామని గొప్పలు చెప్పి.. అధికారంలోకి వచ్చాక కుంటి సాకులు చెబుతూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు వికృత క్రీడ ఆడుతున్నారు.

కూటమి సర్కారు కక్ష సాధింపు.. దివ్యాంగ పెన్షన్ల తొలగింపు

వీరిలో రీవెరిఫికేషన్‌ చేసినవారు

12,964

జిల్లాలో మొత్తం దివ్యాంగ పింఛనుదార్లు 30,688

అనర్హులని చెబుతున్నవారు 4,148

వృద్ధాప్య పింఛన్లు

679మందికి మంజూరు

వారిలో ఆరోగ్య పింఛన్లు

120 మందికి..

వారి వైకల్యానికి మరో పరీక్ష

అర్హత లేదంటూ తిరస్కారం

వారి గుండెకు తీరని గాయం

చివరకు పింఛనుకు దూరమైన వారు 3,349

సాక్షి, అనకాపల్లి: దివ్యాంగులుగా పుట్టడమే పాపమా..? కూటమి సర్కారు అధికారంలోకి రావడం వారికి శాపమా..? అవును.. రీవెరిఫికేషన్‌ పేరిట కూటమి ప్రభుత్వం అర్హతున్న దివ్యాంగుల పింఛన్లలో భారీ కోత విధిస్తోంది. పది పదేహేనేళ్లుగా పెన్షన్లు తీసుకుంటున్న వారికి కూడా కోత విధించింది. అంగవైకల్యం 40 శాతానికి పైగా ఉండాలంటున్నారు. కానీ 75 శాతానికి పైగా ఉన్నా కూడా పింఛన్లు కట్‌ చేశారు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగుల, దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడిన వారి పింఛన్లను రీవెరిఫికేషన్‌ పేరిట ఏరివేస్తున్నారు. చంద్రబాబు సర్కార్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి నేటి వరకూ జిల్లాలో రూ.6 వేలు పింఛను తీసుకునే దివ్యాంగుల్లో 12,964 మందిని రీవెరిఫికేషన్‌ జాబితాలో చేర్చారు. వారిలో 4,148మందిని అనర్హులుగా ప్రకటించారు. కొందరికి ఆరోగ్య, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసి, చివరకు జిల్లా వ్యాప్తంగా 3349 మంది దివ్యాంగ పింఛన్లు ఎగవేశారు. మళ్లీ అంగవైకల్యం ధ్రువపత్రాలు తెచ్చుకోవాలంటూ వేధిస్తున్నారు. తొలగించిన దివ్యాంగ పింఛనుదారులకు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో నెలరోజుల్లోగా అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

తొలి నెల నుంచీ వంచనే..

కూటమి సర్కారు తొలి నెల నుంచే తన కుటిల నీతిని అమలు చేస్తోంది. పెన్షన్‌ మొత్తం పెంచినట్టే పెంచి, లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వానికి ఇది మామూలే. గతంలో 14 ఏళ్లు సీఎంగా పనిచేసినప్పుడు కూడా ఇలాగే అవ్వా తాతలు, వికలాంగులను వేధించుకుతిన్నారు. మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభిమానిస్తున్నారనే అక్కసుతో అవ్వాతాతలు, దివ్యాంగుల పింఛన్‌ తొలగించి పగ తీర్చుకుంటున్నారు.

దీనికేమంటారు స్పీకర్‌ గారూ.. 1
1/4

దీనికేమంటారు స్పీకర్‌ గారూ..

దీనికేమంటారు స్పీకర్‌ గారూ.. 2
2/4

దీనికేమంటారు స్పీకర్‌ గారూ..

దీనికేమంటారు స్పీకర్‌ గారూ.. 3
3/4

దీనికేమంటారు స్పీకర్‌ గారూ..

దీనికేమంటారు స్పీకర్‌ గారూ.. 4
4/4

దీనికేమంటారు స్పీకర్‌ గారూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement