ఎఫ్‌డీపీ నిర్వహణకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీపీ నిర్వహణకు ఏర్పాట్లు

Aug 18 2025 5:56 AM | Updated on Aug 18 2025 5:56 AM

ఎఫ్‌డీపీ నిర్వహణకు ఏర్పాట్లు

ఎఫ్‌డీపీ నిర్వహణకు ఏర్పాట్లు

మురళీనగర్‌ (విశాఖ): జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన అటల్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎఫ్‌.డి.పి) ను విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో సోమవారం నుంచి నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఎంపికై న 300 కళాశాలల్లో విశాఖపట్నం పాలిటెక్నిక్‌ కాలేజీ కూడా ఉందని కాలేజీ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. రత్నకుమార్‌ తెలిపారు. ‘న్యూమరికల్‌ అప్రోచ్‌ ఇన్‌ డిజైన్‌ థింకింగ్‌’ అనే అంశంపై ఈ కార్యక్రమం ఈనెల 18 నుంచి 23 వరకు జరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి దాదాపు 50 మంది అధ్యాపకులు, పరిశోధకులు ఈ ఆఫ్‌లైన్‌ శిక్షణలో పాల్గొంటారు. కార్యక్రమంలో డిజైన్‌ థింకింగ్‌లో సంఖ్యా విధానాలు, అడ్వాన్స్‌డ్‌ పద్ధతులు, ౖఫైనెట్‌ ఎలిమెంట్స్‌ వంటి అంశాలపై నిపుణులు శిక్షణ ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement