అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య | - | Sakshi
Sakshi News home page

అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య

May 31 2025 1:33 AM | Updated on May 31 2025 1:33 AM

అడ్డు

అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య

యలమంచిలి రూరల్‌: రెండేళ్ల క్రితం యలమంచిలి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బీపీసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన యువతి ఎల్లబిల్లి దివ్య(20) హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. యువతిని హతమార్చి, పెట్రోల్‌ పోసి తగలబెట్టిన ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో 25 నెలలుగా నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెండింగ్‌ కేసుల దర్యాప్తుపై దృష్టి సారించిన యలమంచిలి సర్కిల్‌ పోలీసులు చాకచక్యంగా పలు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకోగలిగారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ హత్య కేసును ఛేదించిన యలమంచిలి సీఐ ధనుంజయరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి పట్టణం, మునగపాక ఎస్‌ఐలు కె.సావిత్రి, పి.ప్రసాదరావులను పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్‌ అభినందించారు. ఈ సందర్భంగా యలమంచిలి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు.

అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన ఎల్లబిల్లి దివ్య(20) 2023 ఫిబ్రవరి 22న యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరం సమీపంలో దారుణ హత్యకు గురైంది. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఎర్రవరం వీఆర్వో చేవేటి అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో ఆమె ఎవరనేది, ఎవరు హత్య చేశారో కూడా గుర్తించలేని పరిస్థితి ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగాను, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కేసు నమోదు చేశారు. హత్యకు గురైన మహిళను తొలుత ట్రాన్స్‌జెండర్‌గా కూడా భావించారు. ఆ తర్వాత హత్యకు గురైంది పూడిమడకకు చెందిన ఎల్లబిల్లి దివ్యగా తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హతురాలు యలమంచిలిలో పలువురు యువకులతో ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో ఆమెతో పరిచయం ఉన్న చాలా మంది యువకులపై అనుమానంతో పోలీసులు విచారించారు. అయినా సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఇటీవల ఈ కేసు దర్యాప్తుపై దృష్టి సారించిన పోలీసులు పలు సాంకేతిక ఆధారాలతో యలమంచిలి ధర్మవరం సీపీ పేటకు చెందిన ప్రగడ రవితేజ(30), సెలంశెట్టి సాయికృష్ణ(20), కాకివాని వీధికి చెందిన బంగారి శివ(23)లను నిందితులుగా నిర్ధారణకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నేరాన్ని అంగీకరించారు.

రెండేళ్ల తర్వాత కేసును ఛేదించిన

పోలీసులు

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

సీఐ, ఎస్‌ఐలను అభినందించిన

డీఎస్పీ విష్ణుస్వరూప్‌

వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే..

దివ్యకు కేసులో ప్రధాన నిందితుడు ప్రగడ రవితేజకు రిలేషన్‌షిప్‌ ఉండేది. రవితేజ మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెతో వివాహం కూడా నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య.. తనను వివాహం చేసుకోవాలని రవితేజను కోరింది. లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తానని బెదిరించింది. దివ్యను వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని రవితేజ ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. ఇందుకు స్నేహితులైన సెలంశెట్టి సాయికృష్ణ, బంగారి శివల సహాయం కోరాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దివ్యను పిడిగుద్దులు గుద్ది, చాకుతో పొడిచి చంపారు. అక్కడితో ఆగకుండా మృతురాలి ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. నిందితుల్లో ప్రగడ రవితేజ, సెలంశెట్టి సాయి కృష్ణలు యలమంచిలి రూరల్‌ పీఎస్‌లో గంజాయి చోరీ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. మూడో నిందితుడు బంగారిశివపై కొట్లాట కేసు ఉంది. అంతేకాకుండా నిందితులు ముగ్గురూ గంజాయికి అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకెవరూ నిందితులు లేరని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ముగ్గుర్నీ శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు.

అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య 1
1/1

అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement