● ఎస్‌ఐ సురేష్ సొంత నిధులతోమరమ్మతులు
గూడెంకొత్తవీధి: పూర్తిగా శిథిలావస్థకు చేరిన గూడెం బస్‌షెల్టర్‌కు ఎస్‌ఐ సురేష్ చొరవతో కొత్త రూపు వచ్చింది. సొంత నిధులతో ఆయన బస్‌షెల్టర్‌కు మరమ్మతులు చేయించారు. గతంలో నిర్మించిన ఈ బస్‌షెల్టర్ కాలక్రమేణా పూర్తిగా పాడైపోయింది. నాయకులు, అధికారులు నిత్యం అటుగా వెళ్తున్నా దాని మరమ్మతులపై ఎవరూ దృష్టి సారించలేదు. బస్‌షెల్టర్ దుస్థితిని గమనించిన ఎస్‌ఐ సురేష్ దానిని బాగు చేయించాలని సంకల్పించారు. కొద్ది రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేయించడంతో పాటు రంగులు వేయించారు. దీంతో బస్‌షెల్టర్ కొత్తగా నిర్మించినట్లుగా కనిపిస్తోంది. షెల్టర్ ముందు ద్విచక్ర వాహనాలు వెళ్లకుండా ఇనుప రాడ్లను కూడా ఏర్పాటు చేయించారు. ఎస్‌ఐ సురేష్ చేసిన ఈ పనిపై స్థానికులు, ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.


