● స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల తనిఖీ
● పటిష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘాకు ఆదేశాలు
అరకులోయ (సాక్షి, పాడేరు): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అరకులోయ మండలంలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ టి.నిశాంతి మంగళవారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌ను తనిఖీ చేసిన ఆమె ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌తో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా, ఎన్నికల సామగ్రి భద్రపరిచే విధానంపై అధికారులతో సమీక్షించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘ మార్గదర్శకాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.


