గరిమండలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

గరిమండలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌

Nov 2 2026 1:41 AM | Updated on Nov 2 2026 1:41 AM

కొయ్యూరు: బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని గరిమండ గ్రామంలో ఆదివారం మంప ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటినీ తనిఖీ చేయడంతో పాటు అనుమానిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ.. గ్రామానికి కొత్త వ్యక్తులు లేదా అనుమానితులు ఎవరైనా వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో వివాదాలు సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement