● విశ్వం ఫౌండర్ యూనివర్స్
డుంబ్రిగుడ: ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మండల కేంద్రం డుంబ్రిగుడలో విశ్వం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యూనివర్స్ ఆదివారం వినూత్న ప్రచారం నిర్వహించారు. జాతీయ రహదారి వద్ద బ్యానర్ ప్రదర్శిస్తూ, మైక్ ద్వారా ఓటుకు నోటు తీసుకోవద్దని, డబ్బు ఆశ చూపి ఓట్లు కొనుగోలు చేయవద్దని ప్రచారం చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి గాసి పాల్గొన్నారు.


