పోస్టల్‌ బ్యాలెట్‌కు విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌కు విశేష స్పందన

Nov 2 2026 1:41 AM | Updated on Nov 2 2026 1:41 AM

ముంచంగిపుట్టు: స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షణలో మొత్తం 111 మంది ఉద్యోగులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. స్థానిక ఎస్‌ఐ నాని ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్‌, ఏపీఎస్‌పీ పోలీసులు మండల పరిషత్‌ కార్యాలయం చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అసిస్టెంట్‌ ఆర్‌వోలు ధర్మారావు, త్రినాథనాయుడు పాల్గొన్నారు.

జి.మాడుగుల: మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఆదివారం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఉద్యోగులకు ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తం 64 పోస్టల్‌ బ్యాలెట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

చింతపల్లి: మండలంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 175 దరఖాస్తులు స్వీకరించినట్లు రిటర్నింగ్‌ అధికారి రమణారావు తెలిపారు. ఆదివారం వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తులు అందజేశారు. శనివారం 15 మంది, ఆదివారం 160 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు దరఖాస్తులు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లాలం సీతయ్య, ఎంఈవో ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

143 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం

కొయ్యూరు: మండలంలో 143 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఆర్‌వో వై.వి. నరసింహారావు ఆధ్వర్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటీడబ్ల్యూఓ క్రాంతికుమార్‌ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం ఓటు వేసిన బ్యాలెట్‌ పత్రాలను కవర్లలో ఉంచి బాక్సుల్లో వేయించారు. మొత్తం 143 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement