పెదబయలు: మండలంలోని గోమంగి ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని గుల్లేలు పంచాయతీ జంగంపుట్టు గ్రామానికి చెందిన బీఎస్పీ సీనియర్ నాయకులు కొరవంగి ఎండునాయుడు, కొరవంగి రాజారావు వైఎస్సార్సీపీలో చేరినట్లు గోమంగి సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి సాగేని చంద్రకళ, పార్టీ సీనియర్ నాయకుడు సాగేని నాగరాజు తెలిపారు. ఆదివారం బీఎస్పీ నాయకులతో పాటు గ్రామానికి చెందిన 40 కుటుంబాల నుంచి 90 మంది వైఎస్సార్సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. 2029లో మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని కొత్తగా పార్టీలో చేరిన వారు తెలిపారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంగంపుట్టు గ్రామానికి చెందిన రాంబాబు, శ్రీనుబాబు, మాజీ జెడ్పీటీసీ కొంటా సూర్యనారాయణ, సీనియర్ నాయకులు కూడ కళ్యాణం, గుల్లేలు పంచాయతీ పార్టీ అధ్యక్షుడు గంపరాయి సుబ్బారావు, బూడిదే బాలరాజు, పార్టీ నాయకులు కొంటా నవీణ, సత్తిబాబు, మత్స్యకొండబాబు, కొమ్మ బాలరాజు, సాగేని పండన్న, కొంటా తిరుపతిరావు, పూజారి రాంబాబు, కుంబిడి వెంకటరమణ, జర్సింగి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


