సీలేరు: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో కలిసి ఆదివారం సీలేరు, దుప్పులవాడ, దారకొండ, గుమ్మరేవుల పంచాయతీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వారపు సంతలో పార్టీ జెండాలతో ర్యాలీ చేపట్టి ఓటర్లను కలిశారు. ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం పనిచేసిన వైఎస్సార్‌సీపీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కోరారు. సీలేరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో జెడ్పీటీసీ అభ్యర్థి కంకిపాటి గిరిప్రసాద్, సీలేరు ఎంపీటీసీ అభ్యర్థి ఎం.ప్రియా, గుమ్మరేవుల అభ్యర్థి కుర్ర అప్పారావు, దారకొండ అభ్యర్థి రాజేశ్వరి, దుప్పులవాడ అభ్యర్థి వెలుగోరి సత్యనారాయణతో పాటు మాజీ ఎంపీపీ కుమారి, కుందేరి రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ నాయకులు వెంకటరావు, బుజ్జి, గణేష్, మాజీ ఎంపీటీసీ సాంబమూర్తి, మాజీ సర్పంచులు దుర్జో, రాజు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు బుజ్జి, మాజీ ఉపసర్పంచ్ కారే శ్రీనివాస్, వల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు


