జి.మాడుగుల: మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) ఇన్‌చార్జిగా తహసీల్దార్ గిడ్డి రాజ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అథారిటీ ఆదేశాల మేరకు గతంలో ఎంపీడీవోగా పనిచేసిన డేవిడ్‌రాజ్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకానికి సంబంధించిన సమాచారాన్ని మండల స్థాయి అధికారులకు, సంబంధిత శాఖల సిబ్బందికి తెలియజేశారు. అలాగే ఎస్‌బీఐ బాకూరు, యూబీఐ జి.మాడుగుల శాఖలతోపాటు పాడేరు ఎస్‌టీవో, జిల్లా పరిషత్ సీఈవో, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా కలెక్టర్ తదితరులకు సమాచారం అందించేందుకు ఉత్తర్వుల ప్రతులను పంపించారు.


