స్ట్రాంగ్ రూమ్‌లు, సీసీ కెమెరాలఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
పటిష్ట భద్రత, నిరంతర నిఘా ఉండాలి
అధికారులకు పాడేరు సబ్ కలెక్టర్ కె.సాహిత్ ఆదేశాలు
డుంబ్రిగుడ/అరకులోయ/అనంతగిరి: త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, సీసీ కెమెరాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని పాడేరు సబ్ కలెక్టర్ కె.సాహిత్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లోని ఎన్నికల ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, పటిష్ట భద్రత నడుమ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్ పెట్టెల భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటలూ నిఘా ఉండేలా సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి కవరేజీని పక్కాగా పర్యవేక్షించాలని మండల ప్రత్యేక అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సిబ్బందికి సూచించారు. భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్ల పర్యవేక్షణలో మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, స్ట్రాంగ్ రూమ్ ఇన్‌చార్జీలు, రెవెన్యూ, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
ముంచంగిపుట్టులో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
ముంచంగిపుట్టు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు పాడేరు సబ్ కలెక్టర్ సాహిత్ సూచించారు. మండల కేంద్రం ముంచంగిపుట్టులో సోమవారం సబ్ కలెక్టర్ నాగ వెంకట సాహిత్ పర్యటించి, ఎన్నికల ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్, కౌంటింగ్ గదులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. మండలంలో పోలింగ్ కేంద్రాలు వివరాలు అడిగి తెలుసుకుని, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. రానున్న అర్నాబ్ తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖాల అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ధర్మారావు, త్రినాథనాయుడు పాల్గొన్నారు.


