కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు
జెడ్పీటీసీ అభ్యర్థులకు పార్టీ బీఫారాల అందజేత
పాడేరు: రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. సోమవారం పాడేరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు ఆయన బీ–ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఈ పాలన నుంచి విముక్తి పొందేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఓటరూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య, మాజీ ఎమ్మెల్యేలు కొట్ట గుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు నియోజకవర్గ పరిశీలకుడు ఏడువాక సత్యారావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, జిల్లా ఉపాధ్యక్షుడు గంపరాయి దిలీప్‌కుమార్, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు వంటబు శ్యామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో వైఎస్సార్‌సీపీ
జెడ్పీటీసీ అభ్యర్థులు వీరే..
కొయ్యూరు: గొడ్డేటి మాధవి
ముంచంగిపుట్టు: జల్లిపల్లి సుభద్ర
పాడేరు: సీదరి రాంబాబు
జి.మాడుగుల: ఐసారం మహేశ్వరి
చింతపల్లి: కోరాబు అనూషాదేవి
జి.కె.వీధి: కంకిపాటి గిరిప్రసాద్
హుకుంపేట: ఒంటెబు ప్రియాంక
పెదబయలు: వంతాల శాంతి
డుంబ్రిగూడ: మజ్జి హరి
అరకు వ్యాలీ: కిమిడి అశోక్
అనంతగిరి: జయవర్ధిని


