ప్రశాంత పోలింగ్‌కు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత పోలింగ్‌కు చర్యలు

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

చింతపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌వో రమణరావు తెలిపారు. ఆదివారం ఆయన ఎంపీడీవో లాలం సీతయ్యతో కలిసి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన మలపం, కుడుముసారె పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌వో మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద తప్పనిసరిగా ర్యాంపు ఉండాలని, విద్యుత్‌, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ సౌకర్యాలు లేని కేంద్రాల్లో తక్షణమే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మండలంలోని 17 పంచాయతీల పరిధిలోని సెగ్మెంట్లలో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.

ఆర్వో రమణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement