బస్‌ షెల్టర్‌కు మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

బస్‌ షెల్టర్‌కు మరమ్మతులు

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

● పనులు చేపట్టిన ఎస్‌ఐ సురేష్‌

గూడెంకొత్తవీధి: పాడైపోయిన బస్‌ షెల్టర్‌తో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గమనించిన స్థానిక ఎస్‌ఐ సురేష్‌ మరమ్మతులు చేయించేందుకు ముందుకొచ్చారు. ప్రయాణికుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి, షెల్టర్‌కు మరమ్మతులు చేపట్టారు. ఈ బస్‌ షెల్టర్‌ వద్ద నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉంటారు. అయితే షెల్టర్‌ పాడైపోవడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్‌ఐ సురేష్‌ స్వయంగా చొరవ తీసుకుని మరమ్మతులు చేయిస్తున్నారు. ఆయన చర్యలపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్నాళ్లూ పాడైన షెల్టర్‌ను ఎందరో చూసినా పట్టించుకోలేదని, ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి ఎస్‌ఐ మరమ్మతులు చేయించడం ఆనందంగా ఉందని వారు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement