గిరి సీమలో సండే సందడి | - | Sakshi
Sakshi News home page

గిరి సీమలో సండే సందడి

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

డుంబ్రిగుడ: మండలంలోని పర్యాటక ప్రాంతాలు శని, ఆదివారాల్లో సందర్శకులతో సందడిగా మారాయి. దసరా సెలవులు ముగిసినా పర్యాటకుల రాక తగ్గలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల హడావుడి కొనసాగుతున్నప్పటికీ మైదాన ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు కుటుంబాలతో చాపరాయి జలపాతం, అరకు పైనరీ ప్రాంతాలకు తరలివచ్చారు. పర్యాటక ప్రాంతాల్లో గిరిజన మహిళలు సంప్రదాయ వస్త్రధారణ, ఆభరణాలతో సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. గిరిజన వేషధారణలో ఫొటోలు దిగేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. థింసా నృత్యాలతో సందడి చేస్తూ జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు. మరోవైపు స్థానికంగా లభించే వెదురు చికెన్‌, వెదురు బిర్యానీ రుచులను ఆస్వాదిస్తూ పర్యటనను ఆనందంగా గడుపుతున్నారు. పర్యాటకుల రాకతో స్థానిక గిరిజన మహిళలకు ఉపాధి, ఆదాయం లభిస్తోంది.

ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. జలపాతం పరిసర ప్రాంతాలు పర్యాటకుల సందడితో కళకళలాడాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలను వీక్షిస్తూ సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. డుడుమ జలపాతంతో పాటు జోలాపుట్టు జలాశయం, మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం, దేశిమా మ్యూజియాన్ని సందర్శించి ఆనందంగా గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరిహద్దు రహదారులన్నీ పర్యాటకుల రాకపోకలతో సందడిగా కనిపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement