చింతపల్లి: మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఆర్.కూర్మనాథ్ గురువారం పరిశీలించారు. అనంతరం స్థానిక ఏపీఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. మండలంలో ఎన్నికల నిర్వహణ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ విధానం తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ రమణారావు, ఎంపీడీఓ సీతయ్య, ఎంఈఓ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.


