● బస్సుల కష్టాలు షరామామూలే! | - | Sakshi
Sakshi News home page

● బస్సుల కష్టాలు షరామామూలే!

Oct 23 2026 12:39 AM | Updated on Oct 23 2026 12:39 AM

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద విశాఖ బస్సుల పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు

విశాఖ వెళ్లే బస్సు వద్ద ప్రయాణికుల రద్దీ

దసరా సెలవులు ప్రారంభమైనప్పుడు, ముగిసినప్పుడు కూడా ప్రయాణికులకు బస్సు కష్టాలు తప్పడం లేదు. విశాఖపట్నం, చోడవరం వెళ్లేందుకు పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రెండు రోజులుగా ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపకపోవడంతో అందుబాటులో ఉన్న బస్సులు కిక్కిరిసి నడిచాయి. నిలబడేందుకు కూడా ఇబ్బందిగా ఉన్నా ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వచ్చింది. ఘాట్‌ రహదారుల్లోనూ బస్సుల్లో రద్దీ కొనసాగడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడిపి ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

– సాక్షి, పాడేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement