ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

Oct 23 2026 12:39 AM | Updated on Oct 23 2026 12:39 AM

కొయ్యూరు: ఎన్నికల ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌ సూచించారు. ఈ మేరకు ఆర్‌వో నరసింహారావుకు పలు సూచనలు చేశారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. నామినేషన్ల పరిశీలన బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. నామినేషన్‌ పత్రాల్లోని లోపాలను ఎలా సరిచేస్తున్నారని ఆరా తీశారు. అభ్యర్థులు నామినేషన్‌ ఫారంతోపాటు జత చేయాల్సిన పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆర్‌వో గదిలో అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్న డిపాజిట్‌ వివరాలను తెలుసుకున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులకు డిపాజిట్‌ నగదును తిరిగి చెల్లించాలని సూచించారు.

కౌంటింగ్‌ హాలు మార్పుపై పరిశీలన

ఇప్పటివరకు మండల పరిషత్‌లోనే స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, పోలింగ్‌ బాక్సులను భద్రపరిచి అక్కడే కౌంటింగ్‌ నిర్వహించేవారు. తాజాగా కౌంటింగ్‌ హాలును కొయ్యూరు బాలుర ఆశ్రమ పాఠశాల–1కు మారుస్తున్నారు. అయితే అక్కడి భవనానికి కిటికీలు లేకపోవడం, తలుపులు దెబ్బతినడంతో స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఎన్నికల పరిశీలకుడు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటుకు సంబంధించిన వసతులను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయం పక్కనే ఉన్న కేజీబీవీ భవనం అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో అక్కడ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు. ఆయన వెంట లైజన్‌ అధికారి చలపతిరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement