గూడెంకొత్తవీధి: స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు సూచనలపై చర్చించేందుకు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రమణబాబు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో 18 ఎంపీటీసీ స్థానాలు,జెడ్పీటీసీ స్థానానికి సంబంధించిన పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మంగళవారం ప్రదర్శించారు. గతంలో మండలంలో 48 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఓటర్ల సౌకర్యార్థం అదనంగా మరో 12 కేంద్రాలను పెంచి, ఆ సంఖ్యను 60కి పెంచినట్లు వెల్లడించారు. ఈ పెంచిన పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు లేదా సలహాలు ఉంటే అఖిలపక్ష సమావేశంలో తెలియజేయవచ్చని ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో ఇమ్మానుయేల్, డిప్యూటీ ఎంపీడీవో జగదీష్ పాల్గొన్నారు.


