● ఎస్‌ఐ నాని
ముంచంగిపుట్టు: వాహనదారులు తప్పనిసరిగా రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని, నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని స్థానిక ఎస్‌ఐ పి.నాని సూచించారు. మండల కేంద్రం నుంచి పెదబయలు వెళ్లే మార్గంలో గల కొత్తూరు జంక్షన్ వద్ద ఆదివారం ఆయన ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాహనదారులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ... ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. రవాణా వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి అని, మద్యం సేవించి లేదా అతివేగంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


