జిల్లాలో రాజ్‌మా విత్తనాల కొరత గిరిజన రైతులకు శాపంగా మారింది. గంజాయి నిర్మూలనలో భాగంగా ప్రత్యామ్నాయ సాగుకు మొగ్గు చూపుతున్న రైతులకు అరకొర సబ్సిడీ విత్తనాల పంపిణీ తీరని అన్యాయం చేస్తోంది. ఒకవైపు సాంకేతికత పేరిట ఓటీపీ, నెట్‌వర్క్ సమస్యల నరకం... మరోవైపు రవాణా బాదుడు, దళారుల దోపిడీతో ఏజెన్సీ రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సాక్షి, పాడేరు: జిల్లాలో గిరిజన రైతుల అవసరాలకు, సాగు విస్తీర్ణానికి తగినట్లుగా రాజ్‌మా విత్తనాలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విఫలమైంది. రాజ్‌మా విత్తనాలు విత్తుకునే సమయం ఆసన్నమవ్వడంతో విత్తనాల కొరత గిరిజనులకు తీవ్ర సమస్యగా మారింది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో ప్రతి ఏటా సుమారు 18 వేల హెక్టార్లలో రాజ్‌మా సాగు చేస్తారు. దీనికి దాదాపు 10 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. అయితే ప్రభుత్వం ఈ ఏడాది 90 శాతం సబ్సిడీపై కేవలం 4,913 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఇది కేవలం 9,600 హెక్టార్లకు మాత్రమే సరిపోతుంది. దీంతో మిగిలిన భూముల్లో సాగుకు విత్తనాలు దొరకక గిరిజన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గంజాయి రహిత గ్రామాలకు అరకొర విత్తనాలే!
గంజాయి నిర్మూలనలో భాగంగా ప్రత్యామ్నాయంగా రాజ్‌మా సాగుకు గిరిజన రైతులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు, డుంబ్రిగుడ మండలాల్లోని మారుమూల గ్రామాల గిరిజనులు సబ్సిడీ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. బహిరంగ మార్కెట్, వారపు సంతల్లో దళారులు కిలో విత్తనాలను రూ.130 వరకు విక్రయిస్తుండటంతో గిరిజనులు కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15నుంచి 20 క్వింటాళ్ల విత్తనాల అవసరం ఉన్న గ్రామాలకు వ్యవసాయ శాఖ కేవలం రెండు నుంచి మూడు క్వింటాళ్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓటీపీ, నెట్‌వర్క్ సమస్యలతో నరకం
సబ్సిడీ రాజ్‌మా విత్తనాలు పొందేందుకు గిరిజన రైతులకు ఓటీపీలు, ఆన్‌లైన్ సమస్యలు చుక్కలు చూపిస్తున్నాయి. మారుమూల గ్రామాల నుంచి పంచాయతీ కేంద్రాలకు పట్టాదారు పాస్ పుస్తకాలతో మైళ్ల దూరం నడిచొస్తున్నా... ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ కాలేదని, సెల్‌ఫోన్‌కు ఓటీపీలు రావడంలేదని సిబ్బంది సాకులు చెబుతూ సబ్సిడీ విత్తనాలు ఇవ్వడంలేదని రైతులు వాపోతున్నారు.
రవాణా పేరుతో దోపిడీ
MìSÌZ Æ>gŒæÐ]l* AçÜË$ «§ýlÆý‡ Æý‡*.158 M>V>, 90 Ô>™èl… çܼÞyîl ´ù¯]l$ Ñ$Wͯ]l Ððl¬™é¢-°MóS OÆð‡™èl$-ÌSMýS$ Ñ{MýSƇ$$…-^éÍ. M>± Ð]l*Æý‡$-Ð]lÊÌS {´ë…™éÌZÏ Æý‡Ðé-×ê QÆý‡$aÌS õ³Æý‡$™ø A§ýl-¯]l…V> Ð]lçÜ*Ë$ ^ólçÜ$¢-¯é²Æý‡$. E§é-çßæ-Æý‡-׿MýS$ ò³§ýl-º-Ķæ$Ë$ Ð]l$…yýlÌS… C…fÇ ç³…^éĶæ$¡ `MýS$-糯]lçÜ {´ë…™èl…ÌZ 20 MìSÌZÌS Ñ™èl¢¯éÌS ºÝë¢ çܼÞyîl ´ù¯]l$ Æý‡*.150MóS CÐéÓÍÞ E…yýlV>, íܺ¾…¨ Ð]l$…VýS-âýæÐéÆý‡… Æý‡*.200 ^ö糚¯]l Ñ{MýS-Ƈ$$…-^éÆý‡$. Æý‡Ðé-×ê õ³Æý‡$™ø ºÝë¢MýS$ ₹50 A§ýl-¯]l…V> Ð]lçÜ*Ë$ ^ólĶæ$-yýl…Oò³ WÇ-f¯]l$Ë$ ¡{Ð]l B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólçÜ$¢-¯é²Æý‡$.
ఓటీపీ సమస్యతోఅందని విత్తనాలు
గతంలో భూమి పట్టా చూపి స్తే రాజ్‌మా విత్తనాలు ఇచ్చేవారు. ఏడాది ఆధార్‌తో పట్టా భూమి అనుసంధానం, ఫోన్‌కు వచ్చే ఓటీపీ వంటి సాకులు చెబుతూ విత్తనాలు పంపిణీ చేయకపోవడం దారుణం. మారుమూల గ్రామాల రైతులకు పూర్తిస్థాయిలో రాజ్‌మా విత్తనాలు అందజేయకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. మొబైల్ ఫోన్‌తో సంబంధం లేకుండా రాజ్‌మా విత్తనాలు అందజేయాలి.
– కొర్రవంగి ప్రసాద్,
గిరిజన రైతు, తూలం, పెదబయలు మండలం
చాలని 20 కిలోల విత్తనాలు
సాగుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంట అయిన రాజ్‌మాను ప్రోత్సహించేందుకు పూర్తి శాతం సబ్సిడీపై విత్తనాలు ఇస్తామన్నారు. అయితే పూర్తిస్థాయిలో పంపిణీ చేయకుండా అరకొరగా ఇవ్వడం సరికాదు. నాకున్న పొలంలో పంట సాగుకు వంద కిలోల రాజ్‌మా విత్తనాలు అవసరం కాగా, అధికారులు కేవలం 20 కిలోలకే పరిమితం చేశారు. మిగిలిన విత్తనాలను దళారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత నాకు లేదు. – కిల్లుడు పొట్టిబాబు, గిరిజన రైతు,
చీకుపనస, పెదబయలు మండలం
ఓటీపీలు రావు... విత్తనాలు ఇవ్వరు
రాజ్‌మా విత్తనాల కొరతతో గిరిజన రైతులకు తీరని అన్యాయం
ప్రత్యామ్నాయ సాగు ప్రోత్సాహంపైఅధికారుల నిర్లక్ష్యం
గంజాయి రహిత ఏజెన్సీ లక్ష్యానికిఅధికారులే గండి!


