● దరఖాస్తుల స్వీకరణకు 21 ఆఖరి తేదీ
● ఎకై ్సజ్ డీసీ రామచంద్రమూర్తి
చోడవరం: ఉమ్మడి విశాఖ జిల్లాలో 355 మద్యం దుకాణాల లైసెన్సుల పొడిగింపు (రెన్యువల్)కు నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి తెలిపారు. మద్యం దుకాణాల యజమానులతో చోడవరంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది లీజుదారులు కూడా ఇప్పుడు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.
అనకాపల్లి జిల్లాలో 150, విశాఖ జిల్లాలో 150, అల్లూరి జిల్లాలో 21, పోలవరం జిల్లాలో 15 షాపులతో పాటు పర్మిట్ రూమ్‌ల లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. రెన్యువల్స్ చేసుకునేవారు నాలుగు రకాల చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న లైసెన్సు ఫీజులో 38 శాతం రెన్యువల్ అమౌంట్, ఒక ఇన్‌స్టాల్‌మెంట్ లైసెన్సు ఫీజు, పర్మిట్ రూమ్ లైసెన్సు ఫీజులో ఒక ఇన్‌స్టాల్‌మెంట్, అదేవిధంగా రూ. 5 వేలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పారు. ఈ ఫీజులన్నీ ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని స్పష్టం చేశారు.రెన్యువల్ చేసుకోని షాపులకు 22వ తేదీన రీ–నోటిఫికేషన్ జారీ చేస్తామని డీసీ రామచంద్రమూర్తి చెప్పారు. రీ–నోటిఫికేషన్‌లో ప్రతి షాపునకు ఇచ్చే ప్రతి దరఖాస్తుకూ రూ. 3 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ఒక్కో షాపునకు కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చినప్పుడే కేటాయింపునకు లాటరీ తీస్తామని చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్, డీపీఈవో వి.సుధీర్, చోడవరం సీఐ పాపునాయుడు, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల మద్యం దుకాణాల లైసెన్సుదారులు పాల్గొన్నారు.


