సాక్షి, పాడేరు: వినాయక చవితి పురస్కరించుకుని మట్టి విగ్రహాల వినియోగం, పర్యావరణ పరిరక్షణపై గుర్రగరువు గ్రామంలోని ఆదివాసీ చిన్నారులు ఆదివారం చైతన్య ప్రదర్శన చేపట్టారు. ’బాలనేస్తం క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్’ టీచర్ ఇంద్రజ, గిరిజన సంఘం నాయకుడు పాలికి లక్కు ఆధ్వర్యంలో చిన్నారులంతా మట్టి గణపతి విగ్రహాలను స్వయంగా తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్లకార్డులతో గ్రామంలో ప్రదర్శన నిర్వహిస్తూ, తమ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు ఉచితంగా మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. స్థానిక ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహచలం నాయుడు, రమాదేవి జంట పంపిణీ చేశారు. ఆలయ అర్చకుడు ఉప్పల సీతారామశాస్త్రి, ఆలయ కమిటీ ప్రతినిధులు శివరాత్రి శ్రీనివాస్‌కుమార్, కిముడు ప్రభాకర్, కార్‌ాత్యయని, బొడ్డు ముకుందరావు, సిద్ధనాతి కొండలరావు, కొట్టగుళ్లి పోతురాజు పాల్గొన్నారు.
ఆదివాసీ చిన్నారుల చైతన్య ప్రదర్శన


