రూ.1.47 లక్షల బిల్లు | - | Sakshi
Sakshi News home page

రూ.1.47 లక్షల బిల్లు

Aug 19 2026 12:18 AM | Updated on Aug 19 2026 12:18 AM

అనకాపల్లి జిల్లా మునగపాక మండలం సిరసపల్లి (టి) గ్రామానికి చెందిన రైతు మద్దల వెంకటరావు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ (సర్వీసు నంబర్‌ 1172682212000366) ఇందుకు ఉదాహరణ. 2023 సెప్టెంబరులో ఆయన 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగించారు. అప్పట్లో వచ్చిన బిల్లు సున్నా. అంటే వ్యవసాయ విద్యుత్‌ పూర్తిగా ఉచితంగా అందిందన్నమాట.

అదే సర్వీసుకు 2026 ఆగస్టులో ఈపీడీసీఎల్‌ జారీ చేసిన బిల్లులో మాత్రం రూ.1,47,361 బకాయి ఉన్నట్లు పేర్కొంది. సెప్టెంబరు 2లోగా బకాయి చెల్లించాలని, లేకపోతే సెప్టెంబరు 3న విద్యుత్‌ కనెక్షన్‌ తొలగిస్తామని నోటీసులో స్పష్టం చేసింది. ఒకప్పుడు సున్నా బిల్లు వచ్చిన అదే వ్యవసాయ కనెక్షన్‌కు ఇప్పుడు లక్షన్నర రూపాయలకు చేరువలో బకాయి చూపించడంపై రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement