క్రీడలతో శారీరక దారుఢ్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో శారీరక దారుఢ్యం

Mar 3 2026 8:04 AM | Updated on Mar 3 2026 8:04 AM

డీఎస్పీ అభిషేక్‌

అరకులోయటౌన్‌: క్రీడలు యువతలో శారీరక దృఢత్వం పెంపొందించటంతో పాటు మానసికోల్లాసం కలిగిస్తాయని పాడేరు డీఎస్పీ ఆర్‌.అభిషేక్‌ అన్నారు. హోలీ సందర్భంగా మాడగడ పంచాయతీ కేంద్రంలో నిర్వహించిన వాలీబాల్‌ టోర్నమెంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. చెడు వ్యసనాలకు బానిస కాకుండా సత్‌ ప్రవర్తనతో మెలగాలని సూచించారు. గంజాయి, సారా, ఇతర మత్తు పదార్ధాల జోలికి పోవద్దన్నారు. అనంతరం గిరి మహిళలతో కలిసి థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అరకులోయ సీఐ ఎల్‌.హిమగిరి, ఎస్‌ఐ గోపాలరావు, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు మండియకేడి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement