ఏపీ జెన్‌కో ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సాయం
సీలేరు: ఏపీ జెన్‌కోలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన కె. భవానీ శంకర్ కుటుంబానికి గాజువాక విద్యుత్ ఉద్యోగుల సహకార సొసైటీ తరఫున ఆదివారం తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. సొసైటీ డైరెక్టర్ వై. సత్తిబాబు చేతుల మీదుగా రూ. 10 వేల నగదును భవానీ శంకర్ భార్య ఉమామహేశ్వరికి అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్తిబాబు మాట్లాడుతూ.. భవానీ శంకర్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సొసైటీ నుంచి అందాల్సిన ఇతర ప్రయోజనాలు కూడా సకాలంలో అందేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో కార్మిక సంఘ నాయకులు జి. శివప్రసాద్, పాండురంగ, జోగారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


