రైతులకు అన్యాయం జరిగింది
కాఫీ దీర్ఘకాలిక పంట దానినుంచి వచ్చే ఆదాయంతోనే చాలా గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కాఫీ, మిరియాలు, పైనాపిల్, పసుపు, అల్లం, వరి వంటి పంటలను సాగు చేసే భూములను రైతులు కోల్పోయారు. నష్టపరిహారం పూర్తిస్థాయిలో నేటికీ గిరిజన రైతులకు అందలేదు. జాతీయ రహదారి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదు. కానీ రైతులకు జరిగిన నష్టానికి తగిన ప్రతిఫలమైన పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడం సరికాదు. రైతుల పరిస్థితిని గమనించి వారిని ప్రభుత్వం తగినవిధంగా ఆదుకోవాలి.
– కంకిపాటి గిరిప్రసాద్, రంపుల
పరిహారం అందలేదు
జాతీయ రహదారి నిర్మాణం కారణంగా విలువైన మూడు సెంట్ల భూమిని కోల్పోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి నేటికీ పరిహారం ఇవ్వలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇటు పంటలు పండక ఉన్న భూమిని కోల్పోయి జీవనాధారానికి దూరమయ్యా. అయినప్పటికీ ప్రభుత్వం, జిల్లా అధికారులు తమలాంటి బాధితులను పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో దృష్టి సారించి అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
– లోత సన్యాసిరావు, రంపుల,
గూడెంకొత్తవీధి మండలం
రైతులకు అన్యాయం జరిగింది


