పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

Feb 28 2026 7:23 AM | Updated on Feb 28 2026 7:23 AM

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

పాడేరు రూరల్‌: పరిసరాల పరిశుభ్రత అనేది కేవలం అధికారుల పని మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా పంచాయతీ అధికారి కొండపల్లి చంద్రశేఖర్‌ అన్నారు. ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. శుక్రవారం పాడేరు పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, వ్యర్థాలను పంచాయతీ కార్మికులతో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. పట్టణంలోని వ్యాపారస్తులు, ప్రజలు ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా స్వస్తి పలకాలని సూచించారు. పంచాయతీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వారపు సంతలు, వ్యాపార సముదాయాల్లో పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించినా, వినియోగించినా రూ. 5వేల నుంచి రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మన వీధులు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్‌ ఎంపీడీవో రమేష్‌, పంచాయతీ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement