ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి

Feb 25 2026 9:01 AM | Updated on Feb 25 2026 9:01 AM

ప్రకృ

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి

కోటవురట్ల: ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి సూచించారు. మండలంలో ఆమె మంగళవారం పర్యటించి, రామచంద్రపురం శివారు శ్రీపతిరాజు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఉద్యానవన, వ్యవసాయ అనుబంధ పంటల సాగు పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో చీడపీడలను నివారించడంతో పాటు, అధిక దిగుబడితో ఆరోగ్యకరమైన పంటను పొందవచ్చన్నారు. అనంతరం తంగేడులోని విత్తనశుద్ధి ఫ్యాక్టరీని సందర్శించారు. నాణ్యత పరీక్షల తర్వాత మాత్రమే రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి లచ్చన్న, ఏవో సరోజిని, సిబ్బంది, ఫ్యాక్టరీ యజమాని కొరుప్రోలు శివకుమార్‌ పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి 1
1/1

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement