నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి
కొయ్యూరు: కనీస ప్రొటోకాల్ పాటించకుండా రోడ్డు పనులు చేపట్టిన గిరిజన సంక్షేమ శాఖ డీఈ, ఏఈ లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బడుగు రమేష్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మంప నుంచి గొడుగులమ్మబంద వరకు రహదారి నిర్మించాలని గత నాలుగేళ్లుగా అనేకసార్లు కలెక్టర్లకు విన్నవించామన్నారు. ప్రజాప్రతినిధుల వినతులపై స్పందించిన కలెక్టర్, ఈ పనుల కోసం రూ. 4.5 కోట్ల నిధులను మంజూరు చేశారని తెలిపారు. అయితే, పనులు ప్రారంభించే ముందు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టే ముందు విధిగా భూమి పూజ నిర్వహించడం సంప్రదాయమని, కానీ అధికారులు కనీస సమా చారం ఇవ్వకుండా ప నులు మొదలుపెట్టా రని విమర్శించారు. గొడుగులమ్మబంద గ్రామస్తులను స్వయంగా కలెక్టర్ల వద్దకు తీసుకువెళ్లి, వారి సమస్యలను వివరించడం వల్లే ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన గుర్తుచేశారు. చివరికి ఈ రహదారి కోసం తీర్మానం చేసిన సర్పంచ్‌కు కూడా సమాచారం ఇవ్వలేదని రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ప్రొటోకాల్, సంప్రదాయాలను పాటించని అధికారులపై తక్షణ మే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంపీపీ రమేష్ బాబు డిమాండ్


