హామీలకు, ఆచరణకు పొంతన లేదు
ఎన్నికల ముందు రైతుల కోసం చెప్పిన దానికి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేస్తున్న దానికి పొంతన లేదు. రైతులకు బడ్జెట్‌లో కేటాయింపు చూస్తే చాలా దారుణంగా ఉంది. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం అందించి రైతులకు భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం కొత్త నిబంధనల పేరుతో కొందరు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అందించలేదు. వ్యవసాయ రైతులకు చేసిన దానికి కంటే ఈ ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం అధికంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి.
– బొబ్బర ప్రకాశరావు, వీబీ అగ్రహారం (నాతవరం)


