ఉత్తరవాహినిలో శివనామస్మరణ
నర్సీపట్నం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బలిఘట్టం ఉత్తరవాహిని నది ఒడ్డున త్రిశూల పర్వతంపై వేంచేసియున్న బ్రహ్మలింగేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున సందర్శించారు. ఉత్తర వాహిని నదిలో పుణ్యస్నానాలు ఆచరించి బ్రహ్మలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. స్వామికి లింగోద్భవ కాలమహోన్యాసపూర్వక రుద్రాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు దేవరజంగాలతో పితృదేవతలను పోగిడించుకున్నారు. పాకలపాడు గురుదేవుల ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ మనస్సులో కోరికను గురుదేవుల చెవిలో చెబితే నెరవేరుతాయని భక్తులు విశ్వాసం. గురుదేవుల రథోత్సవాన్ని పట్టణంలో భక్తులు ఊరేగించారు. శ్రీసత్యనారాయణస్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు సదుపాయాలు ఏర్పాటు చేశారు. నాయుడు జ్యూయలర్స్ వారు మజ్జిగ, రోటరీ, శ్రీసత్యసాయి సేవా సంఘం వారు ప్రసాదం పంపిణీ చేశారు. టౌన్ సీఐ గపూర్ ట్రాఫిక్‌ను నియంత్రించారు. స్నానాలు ఆచరించే ప్రాంతంలో చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించేలా మున్సిపల్ కమిషనర్ సురేంద్ర చర్యలు చేపట్టారు.
ఉత్తరవాహినిలో శివనామస్మరణ
ఉత్తరవాహినిలో శివనామస్మరణ
ఉత్తరవాహినిలో శివనామస్మరణ
ఉత్తరవాహినిలో శివనామస్మరణ


