ఆంధ్రాకశ్మీరులో లాభాల పూదోట | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రాకశ్మీరులో లాభాల పూదోట

Jan 20 2026 7:58 AM | Updated on Jan 20 2026 7:58 AM

ఆంధ్ర

ఆంధ్రాకశ్మీరులో లాభాల పూదోట

పలు రకాలు అంతూరియా

పూల అందాలు

చింతపల్లి: ఆంధ్రా కశ్మీరు పర్యాటక ప్రాంతంలో పలు రకాల పూల సాగు పర్యాటకులను కనువిందు చేయడంతో పాటు రైతన్నలకు లాభాల సిరులు కురిపిస్తోంది. మూడేళ్లుగా లంబసింగి పర్యాటక ప్రాంతంలో ఆంధ్రా స్టాబెర్రీ పేరిట స్ట్రాబెర్రీ తోటలతో పాటు పలు రకాలు పూల మొక్కలను కూడా సాగు చేస్తున్నారు. మైదాన ప్రాంతానికి చెందిన యువ కౌలు రౌతులు ఎస్‌.సత్యనారాయణ, కసిరెడ్డి కృష్ణ ..గిరిజనులకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని పూల మొక్కలు పెంచుతూ లాభాలు పొందుతున్నారు. ప్రస్తుతం పర్యాటక సీజన్‌ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది.

ఆంధ్రా స్ట్రాబెర్రీగా లంబసింగిలో పేరుగాంచిన ఈ తోటలో స్ట్రాబెర్రీతో పాటు రెండు ఎకరాల్లో పలు రకాల పూల మొక్కలను సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో లభించే పూల మొక్కలతో పాటు దేశవిదేశాలకు చెందిన అరుదైన మొక్కలను సాగుచేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. బంతి రెండు రకాలు, చామంతి 9 రకాలు, దాలియా 6 రకాలతో పాటు విదేశీ జాతికి చెందిన జరిబిరా 7 రకాలు, అంతూలియా 6 రకాలలో వివిధ రంగులతో కూడిన మొక్కలను సాగు చేస్తున్నారు. ఈ పూల మొక్కలను పూణే, మదనపల్లి, కడియం తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. జరిబిరా మొక్కలను రూ.30, చామంతి రూ.25, మిగిలిన మొక్కలను రూ.10 చొప్పున కొనుగోలు చేసి తీసుకువచ్చి షెడ్లు ఏర్పాటు చేసి బిందు సేద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పూలను కిలో రూ.150 నుంచి రూ. 2వందల వరకూ అమ్మకాలు సాగిస్తున్నారు. సీజన్‌ను బట్టి ఈ పూల వ్యాపారం కొనసాగుతుంది. పండగలు, పెళ్లిళ్లు, వేడుకుల సమయాల్లో కిలో రూ.మూడు వందల వరకూ ధర లభిస్తోంది. ప్రస్తుతం సాగులో ఉన్న జరబిరా, చామంతి పూలు కొన్ని రోజుల పాటు వాడి పోకుండా ఉండే గుణాలున్న పూలని రైతులు తెలిపారు.

పర్యాటకులకు అనుమతి

లంబసింగి పర్యాటక ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల నుంచి రుసుం వసూలు చేసి పూలతోటను సందర్శించేందుకు అనుమతి ఇస్తున్నారు.తోటల సందర్శనకు స్థానికుల నుంచి రూ.20, పర్యాటకుల నుంచి రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది వివిధ వర్ణాల పుష్పాలతో శోభిల్లుతూ చూపరులను మైమరపింపచేస్తుండడంతో ఈ పూల తోటలో వీడియో షూటింగ్‌, ఫొటో షూట్‌లతో ఎంజాయ్‌ చేస్తున్నారు. పూల అమ్మకం ద్వారానే కాకుండా పర్యాటకుల సందర్శనతో కూడా వీరికి అదనంగా ఆదాయం లభిస్తోంది. ఈ ఏడాది పర్యాటకులు రాక అధికంగా ఉండడంతో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. వీరు ఈ తోటల్లో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

బంతి,చామంతితో పాటు స్వదేశీ,విదేశీ రకాల పూల సాగు

లాభాలు ఆర్జిసున్న రైతులు

పర్యాటకులను ఆకర్షిస్తున్న విరుల సోయగాలు

సందర్శకుల నుంచి ప్రవేశ రుసుం వసూలు

ఆంధ్రాకశ్మీరులో లాభాల పూదోట 1
1/3

ఆంధ్రాకశ్మీరులో లాభాల పూదోట

ఆంధ్రాకశ్మీరులో లాభాల పూదోట 2
2/3

ఆంధ్రాకశ్మీరులో లాభాల పూదోట

ఆంధ్రాకశ్మీరులో లాభాల పూదోట 3
3/3

ఆంధ్రాకశ్మీరులో లాభాల పూదోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement