విశాఖ మీదుగా మరో 2 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు
తాటిచెట్లపాలెం(విశాఖ): రెండు అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఆయా తేదీల్లో విశాఖ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటికే బెంగళూరు– మాల్దా టౌన్– బెంగళూరు (13433/13434) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
●నాగర్‌కోయల్ జంక్షన్–న్యూ జల్పయగురి(20604) వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రతీ ఆదివారం రాత్రి 11 గంటలకు నాగర్‌కోయల్ జంక్షన్‌లో బయల్దేరి మూడో రోజు (మంగళవారం) తెల్లవారు 4.10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 4.30 గంటలకు బయల్దేరి బుధవారం తెల్లవారు 5గంటలకు న్యూ జల్పయ్‌గురి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో న్యూ జల్పయ్‌గురి–నాగర్‌కోయల్ జంక్షన్(20603) వీక్లీ అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రతీ బుధవారం సాయంత్రం 4.45 గంటలకు న్యూజల్పయ్‌గురిలో బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 5.10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 5.30 గంటలకు బయల్దేరి శుక్రవారం రాత్రి 11 గంటలకు నాగర్‌కోయల్ జంక్షన్ చేరుకుంటుంది.
●తిరుచ్చిరాపల్లి జంక్షన్–న్యూ జల్పయ్‌గురి(20610) వీక్లీ అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమై ప్రతీ బుధవారం తెల్లవారు 5.45 గంటలకు తిరుచ్చిరాపల్లి జంక్షన్‌లో బయల్దేరి మరుసటిరోజు గురువారం తెల్లవారు 4.10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 4.30 గంటలకు బయల్దేరి శుక్రవారం తెల్లవారు 5 గంటలకు న్యూ జల్పయ్‌గురి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో న్యూ జల్పయ్‌గురి– తిరుచ్చిరాపల్లి జంక్షన్(20609) వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమై ప్రతీ శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు న్యూజల్పయ్‌గురిలో బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 5.10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 6 గంటలకు బయల్దేరి ఆదివారం సాయంత్రం 4.45 గంటలకు తిరుచ్చిరాపల్లి జంక్షన్ చేరుకుంటుంది. ఈ రెండు అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 11–జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్, 8–స్లీపర్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కమ్ లగేజి వ్యాన్, 1–పాంట్రీ కార్ కోచ్‌తో కలిసి మొత్తం 22 కోచ్‌లతో నడుస్తాయి.


