రూ.30 లక్షలతో డొంకరాయి యూనిట్ మరమ్మతులు
సీలేరు: ఏపీ జెన్ కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో ఉన్న యూనిట్ మరమ్మతు పనులను అధికారులు చేపట్టారు. డొంకరాయిలో 25 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్ తరుచూ మొరాయి స్తుండడంతో అధికారులు మరమ్మతు పనులకు ప్రతిపాదించారు. ఈ మేరకు ఏపీ జెన్‌కో హెడ్ క్వార్టర్స్ విజయవాడ(విద్యుత్ సౌథా) నుంచి అనుమతులు రావడంతో రూ.30 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. టెండర్ దక్కించుకున్న అభిరామి ఇంజినీరింగ్ కంపెనీ సోమవారం నుంచి పనులు ప్రారంభించింది. ప్రస్తుతం యూనిట్‌లో ఉన్న రోటార్‌ను బయటకు తీశారు. యూనిట్ రన్నర్‌లో కూడా లీకేజీలు ఉన్నట్లు గుర్తించినట్టు డొంకరాయి డీఈ బాస్కరరావు తెలిపారు.


