తిరుగు ప్రయాణంలో తిప్పలు!
సీలేరు: సంక్రాంతి ప్రభావంతో రవాణా వ్యవస్థలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.పండగకు సొంతూళ్లకు వచ్చి ఆనందంగా గడిపి ఉద్యోగ, ఉపాధి, చదువుల నిమిత్తం తిరిగి నగరాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారికి ఎదురైన ప్రయాణ కష్టాలు అన్నీఇన్నీకావు. ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోవడంతో పిల్లా పాపలతో ప్రయాణం చేసేందుకు పలువురు పాట్లు పడ్డారు. సాధారణ ప్రయాణికులకు ఫ్రీ బస్సు పథకం అవస్థలకు గురిచేసింది. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. మారుమూల ప్రాంతాల్లో సమయానుకూలంగా బస్సు సదుపాయం లేక ఉన్న ఒకటి రెండు బస్సులపై ప్రయాణికులు అందరూ ఆధారపడవలసి రావడంతో పలువురు అవస్థలకు గురయ్యారు. సోమవారం సీలేరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉన్న ఐదు బస్సులు ఖాళీ లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. సీలేరు నుంచి నర్సీపట్నం వెళ్లే బస్సులో 45 సీట్లు ఉండగా సుమారు 120 మంది ఆ బస్సు కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. బస్సు వచ్చేసరికి ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా పరుగులు తీయవలసి వచ్చింది. అయినా ఎక్కేందుకు అవకాశం లేక సీలేరులో ఉండిపోవలసి వచ్చింది.
సీలేరు– నర్సీపట్నం బస్సులో ఎక్కుతున్న
ప్రయాణికులు
బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు
తిరుగు ప్రయాణంలో తిప్పలు!


