విశాఖలో జాన్సన్ ఇనిస్టిట్యూట్ ఆన్ వీల్స్
● వైద్య విద్యార్థులకు శస్త్ర చికిత్సలపై ఈ బస్సులోనే శిక్షణ
కంపెనీ ప్రతినిధులను అభినందిస్తున్న
కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి
మహారాణిపేట: అన్ని రకాల వైద్య విద్యలకు సంబంధించి అధునాతన శిక్షణ అందించే మొబైల్ సర్జికల్ ట్రైనింగ్ సెంటర్ జాన్సన్ ఇనిస్టిట్యూట్ ఆన్ వీల్స్ విశాఖ నగరానికి చేరింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, వైద్య కాలేజీల్లో వైద్య ఆరోగ్యశాఖ, జాన్సన్ ఇనిస్టిట్యూట్ ఆన్ వీల్ సాయంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విశాఖలోని కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీల్లో మూడు రోజుల పాటు పోస్టు గ్య్రాడ్యుయేట్స్, జూనియర్ సర్జన్ల శస్త్ర చికిత్స నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఈ మొబైల్ ట్రైనింగ్ సెంటర్ బస్సు విశాఖకు గురువారం వచ్చింది. ఆంధ్రా మెడికల్ కాలేజీ(ఏఎంసీ) వద్ద బస్సును నిలిపి కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య ప్రాక్టీస్‌లో ఉపయోగపడే కీలక శస్త్ర చికిత్స పద్ధతుల్ని నేర్చుకునే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.


