ఏకలవ్య పాఠశాలలకు పతకాల పంట
వై.రామవరం: మండలంలోని పి.యర్రగొండ ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో పతకాల పంట పండింది. పాఠశాల ప్రిన్సిపల్ భూరారామ్ బైరవ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 17న రౌర్కెలలో జరిగిన 4వ నేషనల్ స్పోర్ట్స్ మీట్‌లో తమ పాఠశాలకు చెందిన 36 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ పోటీల్లో వై.రామవరం మండలం పి.యర్రగొండ ఏకలవ్య పాఠశాలకు–11 బంగారు, 8–రజత, 8–కాంస్య, పతకాలతో కలసి మొత్త 27 పతకాలు తమ విద్యార్థులు సాధించారన్నారు. ఇది తమ పాఠశాలకు గర్వకారణమన్నారు. ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులతో పాటు, పిఈటీ, కోచ్‌లను గురువారం ప్రిన్సిపాల్ భూరారమ్ భైరవ తోపాటు, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
రాజవొమ్మంగి: స్థానిక ఏకలవ్య పాఠశాల విద్యార్థులు అరకు స్పోర్ట్స్ స్కూల్లో ఈనెల 19న జరిగిన ఖేలో ఇండియా మహిళల వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో తమ సత్తా చాటారు. ఈ పాఠశాల నుంచి 19 విద్యార్థులు ఈ పోటీలకు హాజరుకాగా 12 పతకాలను సాధించినట్టు ప్రిన్సిపాల్ కృష్ణారావు తెలిపారు. 8 విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో ఆరు బంగారు, నాలుగు రజత, రెండు కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారన్నారు. పాఠశాలలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయా విద్యార్థులను ప్రిన్స్‌పాల్‌తో పాటు పీఈటీ లోవ సత్యనారాయణ, కోచ్ మాణిక్యాలరావు, ఉపాధ్యాయులు అభినందించారు.
ఏకలవ్య పాఠశాలలకు పతకాల పంట


