వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టం
ముంచంగిపుట్టు: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామాల్లో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించినట్టు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షలు పాంగి పద్మారావు చెప్పారు.మండలంలో నిర్వహించిన సేకరించిన 9వేల కోటి సంతకాల పత్రాలను గురువారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంకు అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు మాట్లాడుతూ గ్రామాల్లో వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, వైద్యం, వైద్య చదువులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వేళ్తే పేదలకు సర్కారు విద, వైద్యం అందని పరిస్థితి నెలకొంటుందన్నారు. వైద్యం అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగా అందుబాటులో ఉండాలని, కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ ప్రక్రియ నిలుపుదల చేయాలని,అంత వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం అగదన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తాడలో కోటి సంతకాల సేకరణ
గంగవరం : పేద విద్యార్థులకు వైద్య విద్యను, పేదలు వైద్యాన్ని దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి , జెడ్పీటీసీ బేబీరత్నం పిలుపునిచ్చారు. గురువారం మెడికల్ కళాశాలలు ప్రైవేటీ కరణపై వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని గంగవరం మండలంలోని కొత్తాడ, సూరంపాలెం గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పిలుపు మేరకు మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్తాడ, సూరంపాలెం గ్రామాల్లో పార్టీ శ్రేణులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు, వైస్ ఎంపీపీ కుంజం గంగాదేవి, సూరంపాలెం ఎంపీటీసీ పద్మావతి, జిల్లా కార్యదర్శి ఏడుకొండలు, పార్టీ మండల ఇన్‌ఛార్జ్ రఘునాధ్, కొత్తాడ , సూరంపాలెం, పిడతమామిడి, ఎండపల్లి, భయనపల్లి, మర్రిపాలెం గ్రామ సర్పంచ్‌లు కామరాజుదొర, శివ దొర, మరిడమ్మ, రామలక్ష్మి, పార్వతి, వెంకటేశ్వర్లుదొర, మాజీ సర్పంచ్ సంకురు దొర, పార్టీ శ్రేణులు రమేష్, శివరామకృష్ణ, బాబి, సుబ్రహ్మణ్యం, సింగారమ్మ, చిన్నబ్బులు, వెంకన్నదొర పాల్గొన్నారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టం


