
పూరిల్లు దగ్ధం
ముంచంగిపుట్టు: మండలంలోని బుంగాపుట్టు పంచాయతీ రంగినిగూడ గ్రామంలో పూరింటికి నిప్పు అంటుకొని బుధవారం పూర్తిగా కాలిపోయింది. రంగినిగూడ గ్రామానికి చెందిన మహిళ కిల్లో బోయిదోయ్ ఇంట్లో వంట చేస్తుండగా పెద్దగా గాలులు వీయడంతో నిప్పు రవ్వలు ఎగిరి ఇంటి పైకప్పుకు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. మహిళ కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి మంటలను అపే ప్రయత్నం చేశారు. గడ్డి ఇళ్లు కావడంతో మంటలు అదుపులోకి రాలేదు. ఇళ్లుపైకప్పు పూర్తిగా కాలిపోయింది. మొండి గోడలే మిగిలాయి. ఇంట్లో ఉన్న దుస్తులు, ధాన్యం బస్తాలు, నిత్యావసర సరకులు అగ్నికి ఆహుతైనట్టు స్థానికులు తెలిపారు. బాధిత మహిళలకు నిలువనీడ కరువైయింది. ప్రభుత్వం ఆదుకోవాలని, ఇళ్లు మంజూరు చేయాలని, ఆర్థికంగా సహాయం అందించాలని బాధిత మహిళ కిల్లో బోయిదోయ్ రోధిస్తూ వేడుకుంది.