
సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన కూటమి ప్రభుత్వం
జి.మాడుగుల: రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండంనాయుడు,సర్పంచ్ లసంగి మాలన్న దుయ్యబట్టారు. మండలంలో బొయితిలి పంచాయతీ కేంద్రంలో పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు గురువారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లేని పోని వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను రద్దు చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతుందన్నారు. గ్రామాల్లో వలంటరీ వ్యవస్థను రద్దు చేసి ఇంటింటికి అందే పెన్షన్లు, సంక్షేమ పథకాలు అమలు జరగకుండా కూటమి ప్రభుత్వం చేసిందన్నారు. గ్రామాల్లో లబ్థిదారినికి ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేసే వాహనాలను రద్దు వంటి పథకాలు రద్దు చేసిందని వారు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ప్రజల వద్దకే పాలన తీసుకువెళితే, కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం వద్దకే ప్రజలు రావాలనే కార్యక్రమం చేస్తుందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పండన్న, మాజీ ఎంపీపీ బ్రహ్మాలింగం, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు, కార్యదర్శి సత్యారావు, లక్ష్మణరావు, మాజీ వైస్ సర్పంచ్ బాబూరావు, మాజీ వార్డు సభ్యులు లక్ష్మణరావు, బాబూరావు, సచివాలయ కన్వీనర్ భగవాన్, పార్టీ పంచాయతీ కార్యదర్శి లక్ష్మణరావు, నాయకులు రమణబాబు, బాలరాజు, పండన్న, నూకరాజు తదితరలు పాల్గొన్నారు.