
వాహనాల డ్రైవర్లు, క్లీనర్లకుభోజన సదుపాయం
● జేకేసీటీ ట్రస్ట్ సేవలు
చింతూరు: వరద నీరు జాతీయ రహదారులపై నిలిచిన కారణంగా చింతూ రు, చట్టిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వా హనాల డ్రైవర్లు, క్లీన ర్లు ఆహారం లేక రెండ్రోజులుగా తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయుర్వేద వైద్యుడు జమాల్‌ఖాన్ తన జేకేసీటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం వారికి ఆహారం అందించారు. ట్రస్ట్ సభ్యులు సాల్మన్‌రాజు, అబ్రార్‌ఖాన్, రియాజ్, అజీజ్, సమీర్, యాకూబ్‌పాషా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.