
ఐపీఎల్ బెట్టింగ్‌తో అప్పులు.. గంజాయితో తీర్చాలని చిక్క
● కుజభంగిలో 31 కిలోల గంజాయి స్వాధీనం
● ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు..పరారీలో ఒకరు
● కేసు నమెదు చేసి రిమాండ్‌కు తరలింపు
ముంచంగిపుట్టు: ఐపీఎల్ బెట్టింగ్‌తో అప్పులపాలైన ఓ యువకుడు, అప్పులను తీర్చాలని అక్రమంగా గంజాయి రవాణాలో దిగి పోలీసులకు చిక్కాడు. ఇందుకు సంబంధించి స్థానిక ఎస్‌ఐ జె.రామకృష్ణ అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు అందిన సమాచారంతో ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం బంగారుమెట్ట పంచాయతీ కుజభంగి జంక్షన్‌లో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒడిశా నుంచి వస్తున్న కారు పోలీసులను చూసి కొంత దూరంలో నిలిపి పారిపోతుండగా దీనిని గమనించిన పోలీసులు వారి వెంట పరుగులు పెట్టి పట్టుకున్నారు. కారును తనఖీ చేసి చూడగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. పట్టుకున్న ముగ్గురు వ్యక్తులను, కారును, గంజాయిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీనిపై విచారణ నిర్వహించగా పట్టుకున్న వ్యక్తులలో విజయనగరం జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన పనస గణేష్ కాగా, అల్లూరి జిల్లా హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ నందివాడ గ్రామానికి చెందిన తాంగుల బుద్దు, డుంబ్రిగుడ మండలం కొండ్రు పంచాయతీ సర్రాయి గ్రామానికి చెందిన కొర్ర నందకుమారుగా గుర్తించారు. వీరి ముగ్గురుపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. పట్టుకున్న గంజాయి 31కిలోలు ఉందని, దీని విలువ రూ.1.55లక్షలు ఉంటుందని, కారు, మూడు సెల్‌ఫోన్లు, వెయ్యి రూపాయల నగదు సీజ్ చేసామన్నారు. పరారీలో ఉన్న గంజాయి స్మగ్లర్ ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా భీమరం గ్రామానికి చెందిన డాబా కిముడుగా గుర్తించామని,త్వరలోనే అతనిని పట్టుకుంటామన్నారు. అయితే అదుపులో తీసుకున్న విజయనగరం జిల్లా వెంకటాపురానికి చెందిన పనస గణేష్ అనే యువకుడు ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ.23లక్షల వరకు అప్పులకు గురైయ్యాడని, అప్పులు తీర్చాలని, గంజాయి అక్రమ రవాణాలో దిగి, విశాఖపట్నంలో గంజాయి విక్రయిస్తూ ఉన్నట్టు విచారణలో తేలిందన్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తూ అతడు చిక్కాడని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్‌ఐ లక్ష్మణరావు, పోలీసులున్నారు.