
రంపచోడవరాన్ని జిల్లాగా ప్రకటించాలి
● రాజమహేంద్రవరంలో విలీనం చేస్తే ఉద్యమిస్తాం
● ఆదివాసీ సంఘాల నాయకులు,
ప్రజా ప్రతినిధుల డిమాండ్
గంగవరం : రంపచోడవరం నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేస్తే ఉద్యమిస్తామని ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఆదివాసీ సంఘాల నాయకులు కత్తుల ఆదిరెడ్డి, వెధుళ్ల లచ్చిరెడ్డి, మద్దిటి అంజిరెడ్డి ఆధ్వర్యంలో రంపచోడవరం జిల్లా సాధన లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంఘాల నాయకులు కత్తుల ఆదిరెడ్డి, వెధుళ్ల లచ్చిరెడ్డి, మద్దేటి అంజిరెడ్డి తదితరులు మాట్లాడారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేస్తే ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యహారాలు హరించే ప్రమాదం ఉందన్నారు. రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లాగా సాధించేందుకు సమైఖ్యంగా పోరాడేందుకు అన్ని సంఘాలు, ప్రజాప్రతినిధులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వారు కోరారు. రంపచోడవరం, గంగవరం జెడ్పీటీసీ సభ్యులు పండా వెంకటలక్ష్మి, రంపచోడవరం, రాజవొమ్మంగి ఎంపీపీలు బంధం శ్రీదేవి, గోము వెంకటలక్ష్మి, నాయకులు వరలక్ష్మి, వెంకటేశ్వుర్లు దొర, సంగిత, రామకృష్ణదొర, ఆదిరెడ్డి, కృష్ణ, బొజ్జయ్య, అంజిరెడ్డి, సత్యనారాయణ, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.