
కన్నబాబుకు అరకు ఎంపీ పరామర్శ
కాకినాడ రూరల్: పితృ వియోగంతో బాధ పడుతున్న వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబును అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజరాణి, పలువురు ముఖ్య నేతలు గురువారం పరామర్శించారు. కాకినాడ వైద్యనగర్ నివాసంలోని కన్నబాబును పరామర్శించిన నేతలు.. ఆయన తండ్రి సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కన్నబాబుకు అండగా నిలిచిన ఆయన తండ్రి సత్యనారాయణ మృతి బాధాకరమని, ఆయన కుటుంబం త్వరగా కోలుకోవాలని ఎంపీ తనూజరాణి సహా, నేతలు ఆకాంక్షించారు. ఎంపీతో పాటు, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, అనంత ఉదయ్‌భాస్కర్, అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, చెట్టి వినయ్, పార్టీ అరకు పార్లమెంటరీ పరిధిలోని నేతలు పరామర్శించారు. ఇంకా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జ్యోతుల చంటిబాబు, పార్టీ ప్రత్తిపాడు కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, కర్రి పాపారాయుడు, రాజమండ్రికి చెందిన మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిశోర్, సీనియర్ నాయకుడు కుంచే రమణారావు, పడమట రాజశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.