
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడాలి
అరకులోయ టౌన్/చింతపల్లి: విద్యుత్ పోరాటంలో 2000లో అశువులు బాసిన అమరులకు సీపీఎం నాయకులు గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఉమామహేశ్వరరావు, చిన్నయ్యపడాల్ విద్యుత్ చార్జీలు పెంపుదలను నిరసిస్తూ 2000లో చేపట్టిన ఆందోళనలో అమరులైన వారిని స్పూర్తిగా అదాని స్మార్ట్ మీటర్లుకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రఽభుత్వం అన్యాయంగా రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామిలను కాల్చి చంపిందన్నారు.ఆదే స్పూర్తితో నేడు ఆదాని స్మార్ట్ మీటర్లును వినిమోగానికి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమరులైన వారి ఆశయాలు కొనసాగిస్తామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు. నాయకులు ధనుంజయ్, చిరంజీవి, రాంబాబు, రామారావు, మగ్గన్న. జగన్నాథం, రామన్న బాలకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.